ఫేస్ బుక్ యూజర్లకు షాక్

SMTV Desk 2018-09-29 14:26:31  Facebook, Facebook users,

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మిలియన్ యూజర్లు.. అంటే 5 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగలించారు. ఫేస్ బుక్ లో ఉన్న సెక్యూరిటీ లోపాన్ని ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు దాదాపు 5 కోట్ల మంది డేటాను తస్కరించినట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. యూజర్ల సెక్యూరిటీ టోకెన్లను యాక్సెస్ చేసుకొని యూజర్ల డేటాను తస్కరించినట్టు ఫేస్ బుక్ చెబుతోంది. యూజర్ల డేటాను రక్షించే చర్యల్లో భాగంగా ఇప్పటికే 9 కోట్ల మంది యూజర్లను మళ్లీ లాగిన్ అవ్వాలంటూ ఫేస్ బుక్ సందేశాలు పంపించింది. ఫేస్ బుక్ లో ఉన్న View As అనే ఫీచర్ లో ఉన్న చిన్న ఎర్రర్ ను పట్టుకొని హ్యాకర్స్ యూజర్ల అకౌంట్లలోకి లాగిన్ అవగలిగారు. మిగితా యూజర్లకు మన ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడమే View As అనే ఫీచర్ ముఖ్య ఉద్దేశం. View As మీద క్లిక్ చేస్తే బయటి వాళ్లు మన ప్రొఫైల్ చూస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. దాన్ని ఉపయోగించుకొని యూజర్ల సెక్యూరిటీ టోకెన్లను తస్కరించి యూజర్ల అకౌంట్లను హ్యాక్ చేసినట్టు ఫేస్ బుక్ భావిస్తోంది. ప్రస్తుతానికి View As అనే ఫీచర్ ను డిసేబుల్ చేశామన్న ఫేస్ బుక్.. హ్యాకింగ్ కు గురయిన 5 కోట్ల యూజర్ల డేటాను రికవరీ చేసినట్టు తెలిపింది.