పశ్చిమ బెంగాల్‌లో కూలిన మరో వంతెన

SMTV Desk 2018-09-07 13:53:45  kolkatta, Siliguri bridge

* మూడు రోజుల్లో కూలిన రెండు బ్రిడ్జిలు కోల్‌కతా : రెండు రోజుల క్రితం మజర్హట్‌ వద్ద జరిగిన ఘటన మరవకముందే కోల్‌కతాలో మరో వంతెన కూలింది. సిలిగురి జిల్లాలో ఫన్సిదేవా ప్రాంతంలో కాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇలా వరుస ఘటనలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పురాతన వంతెనలు ఉన్న చోటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నెల 4న కోల్‌కతాలోని మేజర్‌హట్ బ్రిడ్జి కూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 20 మందికి గాయాలయ్యాయి. 2016లో వివేకానంద రోడ్డులోని ఫ్లైఓవర్‌ కూలిన ఘటనలో 27 మంది మృతిచెందగా, దాదాపు 60 మంది గాయపడ్డారు. .ప్రజలు చనిపోతున్న ప్రభుత్వం పట్టించోకోవడం లేదని విపక్షాలు అంటున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త వంతెనలు నిర్మిచాలని ప్రజలు కోరుతున్నారు.