మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ అరెస్ట్

SMTV Desk 2018-09-06 18:13:21  sanjeev Bhatt, Police arrest, Former IAS oficer

22 ఏండ్ల క్రితం ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు అతడి గదిలో డ్రగ్స్ పెట్టించిన ఘటనలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని సంజీవ్‌భట్‌ను గుజరాత్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1996లో డ్రగ్స్ కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై న్యాయవాది సుమర్‌సింగ్ రాజ్‌పురోహిత్‌ను బనస్‌కాంతా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో సంజీవ్ భట్‌తో పాటు మరో ఏడుగురిని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా కేసు నమోదు అయిన ఇరవై రెండేళ్ల తర్వాత ఓ అధికారిని అరెస్టు చేయడం విశేషం. వివరాల్లోకి వెళితే... 1996లో రాజస్థాన్‌కు చెందిన సమర్ సింగ్ రాజ్ పురోహిత్ మాదకద్రవ్యాలు కలిగి ఉన్నట్లు గుజరాత్ బనస్కాంత పోలీసు స్టేషన్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ కేసును నమోదు చేసిన సమయంలో సంజీవ్ భట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా వ్యవహరిస్తున్నారు.