శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు చేదు అనుభవం

SMTV Desk 2018-09-03 12:51:01  Shivraj Singh, Elections, madya pradesh cm

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు విసిరి నల్లజెండాలు ప్రదర్శించారు ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని చుర్‌హట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు చౌదరి తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆదివారం సాయంత్రం సిద్ధి జిల్లాలోని చుహాట్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 15 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోలో సీఎం చౌహాన్‌ ప్రయాణిస్తున్న బస్సు ముందు కొందరు నల్లజెండాలు ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.