ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి

SMTV Desk 2018-08-29 11:28:51  Vice Presindent, Venkaiah Naidu,

రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు హరికృష్ణ ప్రయత్నించారని ఆయన అన్నారు. అనంతరం హరికృష్ణ అకాల మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా హరికృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఎన్టీఆర్‌ గారి కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. హరికృష్ణ ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి.