రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు

SMTV Desk 2018-08-28 13:38:39  Petrol , deisel, Rates

దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మంగ‌ళ‌వారం రికార్డు స్థాయిలో పెరిగాయి. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన కార‌ణంగా దేశీయ చ‌మురు కంపెనీలు సైతం ఇంధ‌న ధ‌ర‌ల‌ను స‌వ‌రించాయి. దీంతో దేశ రాజధానిలో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్‌ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. తాజా ధరల ప్రకారం.. నేడు దేశరాజధానిలో పెట్రోల్‌ ధర రూ. 78.05గా ఉంది. ఇక ముంబయిలో రూ. 85.47, కోల్‌కతాలో రూ. 80.98, చెన్నైలో రూ. 81.09గా ఉంది. డీజిల్‌ ధర కూడా మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. నేడు దిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 69.61కి చేరింది. ఇక ముంబయిలో రూ. 73.90, కోల్‌కతాలో రూ. 72.46, చెన్నైలో రూ. 73.54గా ఉంది.