రాష్ట్రపతి ఎన్నికల తీరు విధానం ఎలా?

SMTV Desk 2017-07-17 12:24:45  presidential election, process

న్యూఢిల్లీ, జూలై 17 : భారత దేశ రాష్ట్రపతి ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పై నిర్వహిస్తున్నారు. ఆ పేపర్ లో ఓ వైపున అభ్యర్ధుల పేర్లు, మరో వైపున ప్రాధాన్యతా క్రమం ఉండేట్లు నిర్వహిస్తారు. ఓటర్లు తమ అభ్యర్ధుల పేర్లకు ఎదురుగా ఉన్న ప్రాధాన్యత సంఖ్యలను ఎంచుకునేలా ఈ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అదే విధంగా ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో అని ప్రాధాన్యతలను ఓటర్లు ఇవ్వవచ్చును. విజేతను నిర్ణయించే విధానంలోనికి వెళితే... అభ్యర్థి గెలుపొందాలంటే మొత్తం పోలైన, చెల్లుబాటయ్యే ఓట్ల విలువలో 50 శాతం ప్లస్ 1 రావాలి. మొదట తొలి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించి, అందుకు అనుగుణంగా ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్ల మిగిలిన విలువ ఎంతో చెప్తారు. ఎవరైనా 50 శాతం ప్లస్ 1 సాధించి ఉంటే వారిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యతా ఓట్లతో విజేత ఎవరో తెలియక పోతే ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగిస్తూ లెక్కింపును కొనసాగిస్తారు. ఒకవేళ తప్పించిన అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్ పేపర్లలో రెండో ప్రాధాన్యత ఓటు లేకపోతే, దానిని తర్వాతి లెక్కింపుల్లో పరిగణలోనికి తీసుకోవడం జరగదు. ఈ పద్దతి లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి.