ఆసక్తికరంగా సెహ్వాగ్ ట్వీట్‌..

SMTV Desk 2018-07-09 16:02:18  virender sehwag, virender sehwag funny tweet, birth day wishes, dhoni

ముంబై, జూలై 9 : టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చేసే పోస్టులు చాలా విన్నూతంగా ఉంటాయి. అందుకే అతను చేసే పోస్టులు కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. సెహ్వాగ్ చేసే ఫన్నీ ట్వీట్లు, పోస్ట్‌లు వైరల్‌ అవుతూ ఉంటాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో సెహ్వాగ్‌ స్టైలే వేరు. తాజాగా సెహ్వాగ్‌ జులై నెలలో పుట్టిన వారి గురించి ఓ ఫన్నీ ట్వీట్‌ పెట్టారు. అదేంటంటే.. "జులై 7న ధోనీ పుట్టాడు. 8న సౌరవ్‌ గంగూలీ, 10న సునీల్‌ గవాస్కర్‌ పుట్టారు. భవిష్యత్తులో జులై 9న ఓ గొప్ప టీమిండియా కెప్టెన్‌ పుడతాడు. ఒకవేళ పుట్టి ఉంటే ఈరోజు బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉంటాడు. జులైలో పుట్టండి, కెప్టెన్‌ అవ్వండి" అని సెహ్వాగ్‌ సరదాగా ట్వీట్‌ చేశారు. ఇటీవల పుట్టినరోజులు జరుపుకొన్న ధోనీ, గంగూలీకి సెహ్వాగ్‌ తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పారు. రేపు సునీల్‌ గవాస్కర్‌ పుట్టినరోజు. మరి ఆయనకు సెహ్వాగ్‌ ఎలా శుభాకాంక్షలు చెప్తారో చూడాలి.