మసాజ్ సెంటర్లలో వ్యభిచారం

SMTV Desk 2017-07-15 11:56:55  prostitution,massge,center,six,arrested,arrested,puducherry,

చెన్నై, జూలై 15 : పుదుచ్చేరి కొత్త బస్టాండ్ సమీపంలో మరైమలైయడిగల్ రోడ్డులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో, ఆ ప్రాంతంలో ఉన్న మసాజ్ సెంటర్ల పై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఓ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను మఫ్టీలో మసాజ్ చేయించుకునేందుకు సెంటర్ కు పంపారు. వీరు మసాజ్ సెంటర్ కు వెళ్ళగానే ఒక్కొక్కరి వద్ద నుండి మూడు వేల రూపాయిలు తీసుకుని ఆరుగురు మహిళలను అక్కడ నిలబెట్టారు. పోలీసులు ఎంపిక చేసుకున్నఇద్దరు మహిళలు అసభ్యంగా ప్రవర్తించసాగారు. వెంటనే బయట ఉన్న అధికారులకు ఎస్ఎంఎస్ పంపగా వారు మసాజ్ సెంటర్లోకి చేరుకుని ఆరుగురు మహిళలను రక్షించారు. ఈ దాడిలో పట్టుబడిన వారు సామిపల్లె తోటకు చెందిన శశి (32), తమిళ్ సేల్వి (31), దిండివనంకు చెందిన కార్తీక్ (23), లాస్పేట్ కు చెందిన గురుసామి (33) లుగా తెలిసింది. మసాజ్ సెంటర్ నిర్వహాకురాలు ముత్యాలపేటకు చెందిన రాధిక అలియాస్ ఆరోగ్యమేరి కోసం గాలిస్తునట్లు తెలిపారు. ఇద్దరు మహిళలు సహా నలుగురిని అరెస్టు చేసి, శుక్రవారం మేజిస్టేట్ కోర్టులో హాజరుపరిచి కాలాపట్టు జైలుకు పంపినట్లు సమాచారం.