ప్రపంచంలోనే నెం.1 ప్రభుత్వం ... మోదీ

SMTV Desk 2017-07-14 18:01:26  PM Narendra Modi, OECD, INDIA

న్యూఢిల్లీ, జూలై 14 : భారత ప్రధానైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెజార్టీ ఇండియన్స్ విశ్వసిస్తున్నట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన నరేంద్ర అధ్యయనంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పై అత్యధికులకు నమ్మకం ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం ప్రపంచంలోనే 73 శాతం మంది మోదీ ప్రభుత్వాన్ని విశ్వసించడం గమనార్హం. ఇండియా తర్వాత జస్టిస్ ట్రూడీ నేతృత్వం లోని కెనడా ప్రభుత్వం 62 శాతంతో రెండోస్థానం నిలిచింది. మూడో స్థానంలో ఏర్డోగాన్ నేతృత్వం లోని టర్కీ ప్రభుత్వం (58శాతం) నిలవగా.. నాలుగు, ఐదు స్థానాల్లో రష్యా (58 శాతం), జర్మనీ (55 శాతం) ఉన్నాయి. ప్రధాన మంత్రి థెరెసా మే నేతృత్వం లోని బ్రిటన్ ప్రభుత్వం పై 41 శాతం మంది విశ్వాసం కనబరిచారు. ఇక అతి త‌క్కువ‌గా 13 శాతం ప్ర‌జ‌ల విశ్వాసంతో గ్రీస్ ప్ర‌భుత్వం అట్ట‌డుగున నిలిచింది. ప్ర‌జ‌లు త‌మ‌ ప్ర‌భుత్వం ఎంత స్థిరంగా, న‌మ్మ‌ద‌గిన‌దిగా ఉంద‌నే దాన్ని బ‌ట్టి విశ్వాస స్థాయిల‌ను అంచ‌నా వేస్తారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వం లోని ప్రభుత్వం పై 30 శాతం మంది మాత్రమే నమ్మకం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం.