కమలహాసన్ ఇంట్లో చోరికి యత్నం..

SMTV Desk 2018-07-01 14:32:03  kamal hassan, kamal hassan house stolen, mim leader, chennai

చెన్నై, జూలై 1 : ప్రముఖ తమిళ నటుడు, మక్కల్‌నీది మయ్యం వ్యవస్థాపకుడు, కమల్‌హాసన్‌ నివాసగృహంలో దొంగతనానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఆళ్వార్‌పేట ఎల్డామ్స్‌ రోడ్డు సిగ్నల్‌ సమీపంలో ఉన్న కమల్‌ హాసన్‌ నివాస గృహాన్ని పార్టీ ప్రధాన కార్యాలయంగా మార్చారు. దీనికి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తుంటారు. శనివారం తెల్లవారుజామున ఆ ఇంటి ప్రహరీపైకి ఎక్కిన యువకుడు లోపలకు దూకాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతడిని బంధించి అభిరామపురం పోలీసులకు అప్పగించగా.. వారు జరిపిన విచారణలో ఆ యువకుడు దిట్టకుడి ప్రాంతానికి చెందిన శబరినాధన్‌ అని తేలింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చోరీ యత్నం కోసమే ఆ ఇంటి గోడెక్కి దూకానని, అయితే ఆ ఇల్లు కమల్‌హాసన్‌దని తనకు తెలియదని విచారణలో తెలిపాడు.