స్టెయిన్‌ కు విషెస్ చెప్పిన సచిన్, సెహ్వాగ్‌..

SMTV Desk 2018-06-30 17:08:04  sehwag tweet about steyn, dale steyn, sachin tendulkar, sehwag

ఢిల్లీ, జూన్ 30 : టీమిండియా మాజీ క్రికెటర్‌, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తన దైన శైలిలో భిన్నంగా స్పందిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేసే ఈ డాషింగ్‌ ఓపెనర్‌.. దక్షిణాఫ్రికా బౌలర్‌ డేల్‌ స్టెయిన్ జన్మదిన సందర్భంగా చేసిన ట్వీట్‌ అందరినీ తెగ ఆకట్టుకోంటుంది. ఈ నెల 27న సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తన 35వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. "ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌, అతడు బౌలింగ్‌ చేస్తుంటే మైదానంలో పచ్చిక కూడా పచ్చగా వెలిగిపోద్ది. జన్మదిన శుభాకాంక్షలు స్టెయిన్‌" అంటూ ట్వీట్‌ చేశారు. సెహ్వాగ్‌ లాంటి భీకర బ్యాట్స్‌మన్‌ స్టెయిన్‌ను అంతలా పొగడ్తలతో ముంచెత్తడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కూడా స్టెయిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "జన్మదిన శుభాకాంక్షలు స్టెయిన్‌, నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ సచిన్‌ ట్వీట్‌ చేశారు. స్టెయిన్‌ కూడా ఈ క్రికెటర్ల ట్వీట్‌కు రీట్వీట్‌ చేశారు. "నాకు మీ నుంచి విషస్‌ రావడం చాలా సంతోషంగా ఉంది" అంటూ స్టెయిన్‌ రీట్వీట్‌ చేశాడు.