చిక్కుల్లో బిగ్‌బాస్‌..

SMTV Desk 2018-06-24 16:17:58  FEFSI PRODUCER COMMITTEE, BIG BOSS SEASON, TAMIL BIG BOSS, CHENNAI

చెన్నై, జూన్ 24 : దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి నిర్మాతల మండలి తమిళ బిగ్ బాస్ షోకు షాకిచ్చింది. షోకు పనిచేసే కార్మికులలో 75 శాతం మంది ఫెఫ్సీ సభ్యులై ఉండాలన్న నిబంధనను షో నిర్వహకులు ఉల్లఘించారని ఆరోపించింది. కార్మికులను మోసం చేస్తున్నారని వెంటనే చర్చలు తీసుకోకుంటే బిగ్ బాస్ షోను బహిష్కరిస్తామని హెచ్చిరించింది. అంతేకాదు బిగ్‌బాస్‌కు యాంకర్ గా పనిచేస్తున్న కమల్ హాసన్‌ను కూడా ఫెఫ్సీ హెచ్చరించింది. మరో రెండురోజుల్లో ఫెఫ్సీ కార్మికులకు 75 శాతం పని కల్పించికపోతే బిగ్ బాస్ ను నిషేదిస్తామని, నటుడు కమల్‌ హాసన్ పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఫెఫ్సీ అద్యక్షుడు ఆర్కే సెల్వమణి ఈ మేరకు ఆదేశాలను జారీచేశారు. సినీ ఇండస్ట్రీలోని 24 క్రాప్ట్ ల సమాహారమే ఫెఫ్సీ. ఈ సంఘం సూచనల మేరకు సినీ సంఘాలన్ని కూడా పనిచేస్తుంటాయి. బిగ్ బాస్ షోకు తమిళ చిత్రసీమకు చెందిన 75 శాతం కార్మికులను వినియోగించాలనే ఒప్పందం ఉంది. తొలి సీజన్‌ సమయంలో కూడా నిర్వహకులు నిబంధనలు ఉల్లంగించటంతో ఫెఫ్సీ, కమల్‌ కలుగచేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇప్పుడు రెండో సీజన్‌కు కూడా బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఫెఫ్సీ ఆదేశాలను మరోసారి పక్కన బెట్టేశారు. దీంతో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.