మోదీకి కౌంటర్ ఇచ్చిన సినీ నటుడు..

SMTV Desk 2018-06-17 17:50:43  modhi, prakash raj, prakash raj counter to pm modi.

హైదరాబాద్, జూన్ 17 : ప్రధాని మోదీపై.. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. లెఫ్టి‌నెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఎల్జీ కార్యాలయంలో ధర్నా చేస్తున్నారు. ఈ విషయమ౦పై ప్రధాని నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా మోదీని ఉద్దేశిస్తూ విమర్శలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ లో.. "డియర్ సుప్రీమ్ లీడర్, ఫిట్ నెస్ ఛాలెంజ్ లు, యోగా, ఎక్సర్ సైజులతో మీరు చాలా బిజీగా ఉన్నారనే విషయం మాకు తెలుసు. ఒక్క క్షణం గుండెల నిండా ఊపిరి పీల్చుకొని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి ప్రభుత్వ అధికారులు పనిచేయాలంటూ ఆదేశించండి.(కేజ్రీవాల్ చేస్తున్నవి మంచి పనులే). ఆ తర్వాత ఎక్సర్ సైజ్ చేయండి. మీ డ్యూటీని కూడా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.