ఫిఫా వరల్డ్‌ కప్‌ : ఆస్ట్రేలియాపై నెగ్గిన ఫ్రాన్స్..

SMTV Desk 2018-06-16 18:05:26  #FIFA WORLD CUP-2018, FRANCE WIN, #FIFA FOOT BALL, RUSSIA

మాస్కో, జూన్ 16 : ఫిఫా వరల్డ్ కప్- 2018 భాగంగా గ్రూపు-సి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ జట్టు 2-1తో ఆస్ట్రేలియాపై గెలిచి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. యువ ఆటగాళ్లతో అడుగుపెట్టిన ఫ్రాన్స్‌ తొలి మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శన చేసింది. మ్యాచ్‌ మొదటి నుండి హోరాహోరీగా ఇరు జట్లు తలపడటంతో తొలి సెషన్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. తర్వాత మొదలైన ద్వితీయర్థం ఆటలో 58వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ లభించడంతో ఫ్రాన్స్‌ ఆటగాడు ఆంటోనియో గ్రేజ్‌‌మెన్‌ దానిని గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. అనంతరం 63 నిమిషంలో పెనాల్టీ కిక్‌ లభించడంతో ఆస్ట్రేలియా ఆటగాడు జెడ్నాక్‌ దానిని గోల్‌ కొట్టి స్కోరును సమం చేశాడు. దీంతో మరో గోల్‌ కోసం రెండు జట్లు గట్టిగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలో 81 నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు పోగ్బా వచ్చిన అవకాశాన్ని వృథా చేయకుండా గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌ ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు మ్యాచ్‌ సమయం కూడా ముగిసిపోవడంతో ఫ్రాన్స్‌ విజయం సాధించింది.