సెల్ఫీల మోజు ప్రాణం తీసేనా

SMTV Desk 2017-07-11 15:32:36  selfee, Youth, Watery grave, boat, maharastra, nagpur, dyam

నాగ్ పూర్, జూలై 11 : ఇటీవలి కాలంలో ఎవరి చెంత చూసిన ఫోన్లు ఆ ఫోన్ సెల్ఫీలలో యువత మునిగిపోతుంది. కానీ ఈ సేల్ఫీల పిచ్చితో ప్రాణపయస్థితిలో పడిపోతున్న యువతా. మహారాష్ట్రలో ఓ బోటు తిరగబడి పుట్టిన రోజు వేడుక చేసుకుంటున్న ఎనిమిదిమంది స్నేహితులను ఈ సేల్ఫీ పిచ్చి జలసమాధి చేసింది. నాగ్ పూర్ సమీపంలో వీణా డ్యామ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళితే ఓ స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా మిగతా ఎనిమిదిమంది యువకులతో కలిసి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కి చెందిన వీణా డ్యామ్ వద్దకు వెళ్లారు. అక్కడి బోటు నడిపే ముగ్గురితో సహా అందరు బోటులో కూర్చొని డ్యామ్ లోకి వెళ్లారు. బోటు ఎక్కడంతోనే గంతులు, కేకలు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించారు. తమ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలను ఫేస్ బుక్ లైవ్ లో ఉంచారు. సెల్ఫీలు తీసుకుంటూ ఇంకా ఎక్కవగా అల్లరి మొదలుపెట్టారు. చివరకు అది శ్రుతిమించడంతో బోటు తిరగబడింది. దీంతో మునిగిపోతున్న వారిలో ముగ్గురిని స్థానికులు రక్షించగా మిగిలిన ఎనిమిదిమంది రక్షించలేకపోవడంతో అక్కడే జలసమాధి అయ్యారు. అధికారయంత్రాంగం జరిపిన గాలింపు చర్యల్లో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఒక్కరి కోసం ఇంకా గాలింపును కొనసాగిస్తున్నారు. ఈ మృతులంతా నాగ్ పూర్ కు చెందినవారని పోలీసు అధికారి వెల్లడించారు.