కర్ణాటక సీఎంను కలిసిన కమల్‌హాసన్..

SMTV Desk 2018-06-04 19:53:51  kamal hasan, kumara swami meeting, cauvery issue, mim leader kamala hasan

బెంగళూరు, జూన్ 4 : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ సోమవారం భేటీ అయ్యారు. కమల్‌హాసన్ కావేరి నదీ జలాల పంపిణీ అంశంపై సీఎం కుమారస్వామితో చర్చించారు. కావేరీ నదిజలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రితో కమల్‌ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ మాట్లాడుతూ.."కావేరీ జలాలను తమిళనాడు-కర్ణాటక ఇద్దరూ పంచుకోవాలి. ఇందులో మరో దారి లేదు. ఈ నేపథ్యంలో కుమారస్వామితో భేటీ అయ్యాను. సమస్యపై స్పందించాల్సిందిగా ఆయనను కోరాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. నిజానికి కుమారస్వామి కూడా సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రిగా ఆయనా ప్రయత్నాలు చేస్తున్నారు. మా భేటీలో రాజకీయ కోణం ఎంతమాత్రం లేదు. కావేరీ వివాదం విషయమై తమిళనాడులో నిరసనలు ఎక్కువయ్యాయి. అవన్నీ మరింత హింసాత్మకంగా మారక ముందే ఇరు రాష్ట్రాలు దీనిపై దృష్టి పెట్టాలని ఆయనను కోరాను" అని కమల్ వ్యాఖ్యానించార