సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల ..

SMTV Desk 2018-05-29 16:00:05  cbse 10 th result, cbse results, cbse education, delhi

ఢిల్లీ, మే 29 : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 2017-18 విద్యాసంవత్సరానికి గానూ పదో తరగతి పలితాలు మంగళవారం విడుదలయ్యాయి. తొలుత సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించినా. మధ్యాహ్నమే ఫలితాలను వెల్లడించారు. cbse.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్లతో పాటు ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ ద్వారా కూడా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 16లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 86.7శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 88.67శాతం మంది బాలికలు, 85.32శాతం మంది బాలురు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. కాగా.. ఈసారి ప్రథమ ర్యాంకును నలుగురు విద్యార్థులు పంచుకుంటున్నారు. మార్చిలో నిర్వహించిన ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి గణిత ప్రశ్నాపత్రం పరీక్ష ముందుగానే లీకైంది. 12వ తరగతి ఎకనామిక్స్‌ పేపర్‌ కూడా లీక్‌ అవడంతో ఆ పరీక్షను మళ్లీ ఏప్రిల్‌ 25న నిర్వహించారు. అయితే పదో తరగతి గణిత పరీక్షను మాత్రం తిరిగి నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ తెలిపింది.