వైరల్ గా మారిన జార్ఖండ్ సీఎం వీడియో

SMTV Desk 2017-07-10 14:05:13  Jharkhand, CM, who, washes, the, legs, with, women

రాంచీ, జూలై 10 : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సద్గురు సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. బాబా దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా జార్ఖండ్ లోని జంషెడ్‌పూర్‌ నగరానికి చెందిన మహిళలు గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని ‘గురు మహోత్సవ్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన రాగానే మహిళలంతా పూలు వేసిన పళ్లెంలో ఆయన పాదాలు కడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.