జీఎస్టీ యాప్ ఆవిష్కరణ

SMTV Desk 2017-07-08 15:45:38  gst aap, smart phone, down load, arun jaitli,Central Board of Excise and Customs

ముంబై, జూలై 8 : ఇటీవల దేశంలో అమలైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో ఎన్నో ప్రశ్నలు, పుకార్లు, సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఏ వస్తువుకు ఎంత పన్ను చెల్లించాలి? ఏ సేవ ఏ పన్ను విభాగం కిందకు వస్తుందో తెలియడానికి వ్యాపారులకు, ప్రజలకు దీనిపై ఇంకా పూర్తి అవగాహన రావడం లేదు. ఈ ప్రభావంతో ఎట్టకేలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ జీఎస్టీ పై రేట్స్ ఫైండర్ మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఆవిష్కరించారు. ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫామ్ పై దీనిని వాడుకోవచ్చునని, అయితే త్వరలో ఐఓఎస్ లో కూడా ఈ యాప్ అందుబాటులోకి తేనున్నట్లు అధికారి వెల్లడించారు. దీనిని స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా ఏదైనా వస్తువు లేదా సేవకు ఎంత పన్ను చెల్లించాలో సులువుగా తెలుస్తుందని, ఈ మేరకు జీఎస్టీ పై అవగాహన లేని వారికి, ఈ యాప్ తో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.