సైకిలెక్కి నిరసన వ్యక్తం చేసిన రాహుల్‌గాంధీ..

SMTV Desk 2018-05-07 17:36:20  RAHUL GANDI, PROTEST, PETROL DISEAL RATES INCREASE.

కోలార్‌, మే 7 : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. కోలార్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బసులో ప్రయాణించారు. ఆ తర్వాత ఎద్దుల బండిలో ప్రయాణించి రోజురోజుకీ దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఇందులో భాగంగా ఆయన సైకిల్‌ తొక్కి తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. "సెల్ ఫోన్ లలో వర్క్ మోడ్, స్పీకర్ మోడ్, ఏరోప్లేన్ మోడ్.. ఇలా మూడు మోడ్స్ ఉంటాయి. అందులో ప్రధాని మోదీ.. కేవలం స్పీకర్ మోడ్, ఏరోప్లేన్ మోడ్ లను మాత్రమే వాడుతున్నారని.. వాడుతున్నారు కాని ఎప్పటికీ వర్క్ మోడ్ ను వాడారని ఎద్దేవా చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌, భాజపాలు తమ ప్రచారాలను ముమ్మరం చేస్తూ ఒకరిపై ఒకరు పరస్పర మాటల యుద్దానికి దిగుతున్నారు. కాగా కర్ణాటక ఎన్నికలు మే 12న ఎన్నికలు జరగనున్నాయి,