ప్రతీకారం తీర్చుకున్న ముంబై..

SMTV Desk 2018-04-29 10:35:00  rohith sharma, chennai super kings, mumbai indians, ipl

పుణె, ఏప్రిల్ 29 : టోర్నీ ఆరంభం మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పైన ఓటమికి ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకుంది. నిన్న పుణె వేదికగా హోరాహోరిగా జరిగిన మ్యాచ్ లో చెన్నైపై రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టులో సురేశ్‌ రైనా (75, నాటౌట్), అంబటి రాయుడు (46), రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదన లో ముంబై ఇండియన్స్ సులభంగా గెలిచినట్లు కనిపించిన.. క్రమంగా మ్యాచ్ ఉత్కంఠ గా మారింది. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌ (47), సూర్యకుమార్‌ యాదవ్‌ (44), రాణించారు. ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (56, నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ముంబై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సీజన్లో ముంబయికిది రెండో విజయం కాగా..చెన్నైకి రెండో ఓటమి. రోహిత్ ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ గా ఎంపికయ్యాడు.