గాడిద తహసీల్దార్‌ ఉద్యోగం రాస్తుందా..!

SMTV Desk 2018-04-28 13:05:31  Donkey Issued hall ticket, jammu kashmir, mro written test donkey, srinagar

శ్రీనగర్, ఏప్రిల్ 28 ‌: పైన ఉన్న టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా..? ప్రస్తుతం ఉద్యోగ నియామకాలు చేస్తున్న సంబంధిత శాఖలు చేస్తున్న నిర్వాకాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌ అధికారులు చేసిన ఓ పని ఇప్పుడు గాడిద కు పరీక్షా రాసే అవకాశం కల్పించింది. మరిన్ని వివరాలు కు ఇది చదివేయండి. జమ్ముకశ్మీర్‌లో తహసీల్దార్‌ ఉద్యోగాల కోసం త్వరలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దీని కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారి హాల్‌టికెట్లను సంబంధిత శాఖ జారీ చేసింది. అయితే గాడిద పేరుతో పాటు ఫొటో కూడా ఉన్న ఓ హాల్‌టికెట్‌ తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకంతో పాటు జమ్ముకశ్మీర్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు సెక్రటరీ సంతకం కూడా ఉంది. హాల్‌టికెట్‌లో పేరు వద్ద కచౌర్‌ ఖర్‌ అని ఉంది. దీని అర్థం గోధుమ వర్ణపు గాడిద అని. అభ్యర్థి ఫొటో వద్ద గాడిద ఫొటో ఉంది. ఈ హాల్‌టికెట్‌ను ఎవరు డౌన్‌లోడ్‌ చేశారో తెలియదు గానీ ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ‘హాల్‌టికెట్‌ ఐతే ఇచ్చారు గానీ.. మరి గాడిద పరీక్ష రాస్తుందా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.