రామ్ చరణ్, బోయపాటి చిత్ర షూటింగ్ షురూ..!!

SMTV Desk 2018-04-22 17:22:27  ram charan, boyapati sreenu, shooting started, ram charan 12 movie.

హైదరాబాద్, ఏప్రిల్ 22 : రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా కైరా అద్వానీ నటించనుంది. అయితే చరణ్ నేటి నుండి చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ఖాతాలో పంచుకుంటూ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ముందుగా ఆయన దేవుడికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం షూటింగ్ కు బయలుదేరారు. చరణ్ పూజ గదిలో పూజ చేస్తున్న ఫోటోలను ఉపాసన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "రామ్‌చరణ్‌ 12వ సినిమాకు అంతా సిద్ధమైంది. గుడ్‌ లక్‌ మిస్టర్‌ సి (చరణ్‌)" అని ట్వీట్ చేశారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.