గుండెలు పగిలి పోయేలా ఏడ్చినా అన్నదమ్ములు ..!!!!

SMTV Desk 2018-10-03 12:33:26  ntr,kalyan ram, hari krishna ,aravinda sametha pre release event

హైదరాబాద్, అక్టోబర్ 03: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అభిమానుల కోలాహలం మధ్యన గ్రాండ్ గా నిర్వహించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, త్రివిక్రమ్, జగపతి బాబు, దిల్ రాజు, రాజమౌళి కుమారుడు కార్తికేయ, కాబోయే కోడలు పూజ, సినిమాకి సంబంధించిన టీంతో పాటు కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకకి హాజరైన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు విషణ్ణ వదనాలతో కనిపించారు. ఇక హీరోయిన్ పూజ హెగ్డే ఇతర సినిమా షూటింగ్స్ బిజీతో ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయింది. భారీ అంచనాలున్న అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అరవింద సామెత ట్రైలర్ ని కళ్యాణ్ రామ్ స్టేజ్ ఎక్కి విడుదల చేసాడు. మాస్ అండ్ క్లాస్ తో అరవింద సమేత ట్రైలర్ అదిరింది. ఈ టీజర్ చూస్తుంటే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కలయిక ఎలా ఉంటుందో అనేది అర్ధమైపోయింది. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్ తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి మట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన మాటలను మరోమారు గుర్తు చేసుకున్నాడు. తన ఫ్యామిలీలో తన తాతగారికి నిర్మాతల పట్ల, పని పట్ల ఉన్న డెడికేషన్ గురించి చెప్పాడు. 1960ల్లో సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో ఉండగా.. పెద్ద కొడుకు రామకృష్ణ మరణం సంభవించినా షూటింగ్ అయ్యాకే వెళ్లారని… నిర్మాతలని దేవుళ్లుగా భావించేవారని.. వారు నష్టపోకూడదని… అలాగే మళ్లీ 70లలో ఒకసారి తన ముత్తాత చనిపోయినప్పుడు కూడా తన తాత షూటింగ్లోనే ఉన్నారని, ఇక తన తండ్రి కూడా నిర్మాతలను గౌరవించాలని… వారిని నష్టపోయేలా చెయ్యకూడదని చెప్పేవారని.. అందుకే తమ్ముడు ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ చనిపోయిన ఐదో రోజునే అరవింద సమేత షూటింగ్ కి వెళ్లాడని.. తండ్రి మరణంతో అరవింద ఆగుతుందననుకున్నారని.. కానీ తండ్రి మాటలను గుర్తు చేసుకుని అరవింద షూటింగ్ ని నెల రోజుల్లో తమ్ముడు పూర్తి చేసాడని చెప్పాడు. ఇక తండ్రి హరికృష్ణ చనిపోయి దూరమవ్వలేదని… మన మనసులలో బ్రతికే ఉన్నారని… మనందరిలో ఆయన ఎప్పుడూ ఉంటారని చెప్పిన కళ్యాణ్ రామ్ ఎంతో బాధతో ఒక పాట కూడా పాడాడు. అలాగే తమ్ముడు ఎన్టీఆర్ ని నాన్నా అని సంబోధిస్తూ స్టేజ్ మీదకి పిలిచి తండ్రి మరణానికి రెండు నిమిషాల మౌనం పాటించాలని అభిమానులను కోరాడు. ఇక తండ్రి మరణంతో వారెంత కుంగిపోయారో అనేది కళ్యాణ్ రామ్ స్పీచ్ తో అర్ధమయ్యింది. ఇక కళ్యాణ్ రామ్ బాధాతప్త హృదయంతో మాట్లాడిన మాటలు, ఎన్టీఆర్ కన్నీళ్లు అన్నీ అభిమానుల మనసుని పిండేసాయి. ఇక ఈ ఈవెంట్ ని టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా అన్నదమ్ముల కన్నీళ్లు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.