మెగాస్టార్ సినిమాకి మెగా క్లైమాక్స్

SMTV Desk 2018-10-02 13:31:12  Chiranjeevi, Nayanthara, Sye Raa Narasimh reddy,

హైదరాబాద్ , అక్టోబర్ 02: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు కాగా అందులో ఒక్క ఫైట్ సీన్ కే 50 కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. సినిమాలో నాలుగు భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్నాయట. మొదటి భాగంలో 2, ద్వితీయ భాగంలో మరో రెండు ఉంటాయట. క్లైమాక్స్ కు ముందు యుద్ధం భారీగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఒక్క ఫైట్ సీన్ కు కాదు ఈ నాలుగు ఫైట్ సీన్స్ కు కలిపి 50 కోట్లు పెడుతున్నారట. ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక ఫైట్ సీన్ పూర్తి చేశారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో కంపోజ్ చేయిస్తున్న సైరా ఫైట్స్ అందరిని అబ్బురపరుస్తాయని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమిత్ త్రివేది సైరాకు సంగీతం అందిస్తున్నారు.