ఎంట్రీ ఇవ్వబోతున్న నట వారసుడు!

SMTV Desk 2018-10-06 17:22:23  Hyderabad,Nasser, bhasha,cinema

సిల్వర్ స్క్రీన్ పై వారసుల హవా అందరికి తెలిసిందే. తండ్రి తర్వాత నట వారసత్వాన్ని కొనసాగించే ఎంతోమంది స్టార్స్ తో పాటుగా ఇప్పుడు మరో వారసుడు తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇంతకీ ఎంట్రీ ఇవ్వబోతున్న నట వారసుడు ఎవరు అంటే క్యారక్టర్ ఆర్టిస్ట్ నాజర్ చిన్న కొడుకు అని తెలుస్తుంది అతను కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. ఎలాంటి పాత్ర అయినా తన నటనతో మెప్పించే నాజర్ పెద్ద కొడుకు ఇప్పటికే సినిమాల్లో నటిస్తున్నాడు. నాజర్ చిన్న కొడుకు అబీ మెహిదీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళంలో అతని మొదటి సినిమా మొదలవనుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సిని పెద్దల సమక్షంలో ముహుర్తం పెట్టనున్నారట. తెలుగు, తమిళ భాషల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్న నాజర్ తనయుడి కెరియర్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.