రోబో ‘2.ఓ’ పార్ట్ 4 సర్‌ప్రైజ్‌ ఇదేనా !!

SMTV Desk 2018-10-02 15:26:34  Rajanikanth, Shanker, Akshay Kumar, 2.O

హైదరాబాద్ , అక్టోబర్ 02: అక్టోబర్‌2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఈరోజు ఓ చిన్న సర్‌ప్రైజ్‌ను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్ హీరో గా నటించిన చిత్రం రోబో ‘2.ఓ’. ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్‌ పార్ట్‌ను శంకర్‌ విడుదల చేశారు. పార్ట్‌ 4ను ఇలా రూపొందించామంటూ శంకర్‌ పేర్కొన్నారు. వీడియోలో రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌లను యానిమెట్రానిక్స్‌ టెక్నాలజీతో రోబోలుగా ఎలా తయారుచేశారో చూపించిన సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24 వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోస్‌కు సంబంధించిన 1000 మంది ఆర్టిస్ట్‌లు, పది మంది కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్‌లు, 25 మంది త్రీడీ డిజైనర్లు, 500 మంది క్రాఫ్ట్‌మెన్‌లు ఈ సినిమా కోసం పనిచేశారు. సినిమా మొత్తంలో 2150 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ వాడారు. నేటివ్‌ త్రీడీ, యానిమెట్రానిక్స్‌, 1300 ప్రీవిజువలైజేషన్‌ షాట్స్‌, 1000 కాంప్లెక్స్‌ వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌, వీక్యామ్‌ టెక్నాలజీ, స్పైడర్‌ క్యామ్‌ సిస్టమ్స్‌, లైడర్‌ స్కానింగ్‌తో యానిమేషన్‌ సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయికగా నటించారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ రికార్డులు సృష్టించింది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.