వీర రాఘవ ట్రైలర్

SMTV Desk 2018-10-02 09:57:40  Aravinda Sametha, Aravinda Sametha trailer fix,

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సినిమా ట్రైలర్ కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సిని ప్రియులు ఎక్సట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2 హెచ్.ఐ.సి.సిలో అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సినిమా ట్రైలర్ సరిగ్గా రాత్రి 8 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారట. దానికి సంబందించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో వస్తున్న ఈ సినిమా బిజినెస్ లో అదరగొడుతుంది. దసరాకి విజయాన్ని అందుకోవడం అలవాటుగా మారిన ఎన్.టి.ఆర్ కు ఈ అరవింద సమేత ఎంతటి ఘన విజయాన్ని అందిస్తుందో చూడాలి.