నాలుగురోజుల్లో 30కోట్లా!

SMTV Desk 2018-10-03 11:31:58  chekka chivantha , nawab,telugu,tamil

హైదరాబాద్ ,అక్టోబర్ 03: మణిరత్నం తాజా సినిమా చెక్క చివంత వానం తెలుగులో నవాబ్ గా రిలీజైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తమిళంలో ఈ సినిమా 4 రోజుల్లో 30 కోట్ల దాకా కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తుంది. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా సినిమాలోని కొన్ని డైలాగ్స్ మార్చాలంటూ ఎవరో వ్యక్తి మణిరత్నం ఆఫీస్ కు ఫోన్ చేసి బెదిరించాడట. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో విచారణ మొదలు పెట్టారని తెలుస్తుంది. డైరెక్ట్ గా ప్రొడక్షన్ ఆఫీస్ కే ఫోన్ చేశారంటే ఫోన్ చేసిన వ్యక్తి ఎవరా అన్న విధంగా విచారణ మొదలు పెట్టారు. డైలాగ్స్ తొలగించడం మాట అటుంచితే ఫోన్ బెదిరింపులకు పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారని తెలుస్తుంది. మరి అసలు ఈ బాంబ్ బెదిరింపుల వెనుక ఎవరి హస్తం ఉంది.. అందుకు కారణాలు తెలియాల్సి ఉన్నాయి. అయితే ఈ విషయం గురించి మణిరత్నం కాని అతని ఆఫీస్ స్టాఫ్ కాని ఎవరు బయటకి సమాచారం అందించలేదు.