ట్రైలర్ చూస్తే సినిమా పక్కా హిట్

SMTV Desk 2018-10-03 11:20:04  ntr, kalyan ram, thrivikram,aravinda sametha

హైదరాబాద్ ,అక్టోబర్ 03: ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ అనగానే కాంబినేషన్ అదరగొట్టేస్తుందని ఫిక్స్ అయ్యారు నందమూరి అభిమానులు. ఆ అంచనాలకు తగినట్టుగానే వస్తున్నాడు అరవింద సమేత వీర రాఘవ. దసరా బరిలో దుమ్ముదులిపేందుకు వస్తున్న అరవింద సమేత అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్ది గంటల క్రితం జరిగింది. చిత్రయూనిట్ సమక్షంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కళ్యాణ్ రాం అరవింద సమేత ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అటు త్రివిక్రం మార్క్ డైలాగ్.. ఎన్.టి.ఆర్ మార్క్ హీరోయిజం రెండు మిక్స్ చేసినట్టు ఉంది. ట్రైలర్ చూస్తే సినిమా పక్కా హిట్ అనేలా అనిపిస్తుండగా త్రివిక్రం మాటలు.. ఎన్.టి.ఆర్ నోట వస్తుంటే నందమూరి ఫ్యాన్స్ కు కిక్ ఎక్కించేశాయి. ట్రైలర్ చూస్తే స్టోరీ రొటీన్ గా అనిపిస్తున్నా త్రివిక్రం మార్క్ స్క్రీన్ ప్లే, డైలాగ్ పవర్ తో సినిమా హిట్ కొట్టేస్తారని అనిపిస్తుంది.