విజయ్ కి నో చెప్పిన జాన్వీ కపూర్...

SMTV Desk 2018-10-06 17:05:26  cinema,jahnavi kapoor,vijay devarakonda

హైదరాబాద్ ,అక్టోబర్ 06: శ్రీదేవి కూతురుగా సిని రంగ ప్రవేశం చేసిన జాన్వి బాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా దఢక్ సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం కరణ్ జోహార్ చేస్తున్న తఖ్త్ సినిమా చేస్తున్న జాన్వి సౌత్ సినిమాల్లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ సినిమాలో జాన్వి హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. అయితే ఈ వార్తలపై స్పందించింది జాన్వి. ప్రస్తుతం తాను బాలీవుడ్ సినిమాల మీద దృష్టి పెట్టినట్టు తెలిపింది. బాలీవుడ్ లో కెరియర్ కొనసాగించాలని భావిస్తున్నానని చెప్పిన జాన్వి సౌత్ సినిమాలు ఇప్పుడప్పుడే చేసే ఆలోచన లేదని చెప్పింది. అయితే సౌత్ లో తనకు అవకాశాలు వస్తున్న మాట వాస్తవమే కాని ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల మీదే తన పూర్తి ఫోకస్ అని అంటుంది జాన్వి. జాన్వి తెలుగులో నటిస్తుందని వచ్చిన వార్తలు రూమరే అన్నమాట. విజయ్ తో జాన్వి సినిమా అంటూ మీడియా హడావిడి చేయగా ఫైనల్ గా అమ్మడి క్లారిటీతో ప్రేక్షకుల ఆశల్లో నీళ్లు చల్లినట్టు అయ్యింది.