100 కోట్ల క్లబ్బులో "భరత్ అనే నేను"..

SMTV Desk 2018-04-22 14:37:41  MAHESH BABU MOVIE, BHARATH ANE NENU, 100 CRORES COLLECTIONS.

హైదరాబాద్, ఏప్రిల్ 22 : ముఖ్యమంత్రి పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రిన్స్ మహేష్ బాబుపై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహేష్ కథానాయకుడిగా నటించిన "భరత్ అనే నేను" చిత్రం ఇప్పటికే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మహేష్ కు ఈ సినిమా తన కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.