"నేల టికెట్టు" టీజర్‌ విడుదల

SMTV Desk 2018-04-22 11:17:17  nelaticket teaser, raviteja, malavika sharma,

హైదరాబాద్, ఏప్రిల్ 22 : మాస్ మహారాజా రవితేజ వరుస సక్సెస్ లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న "నేల టికెట్టు" చిత్రంలో నటిస్తున్నారు. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ తుళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్‌లో "చుట్టూ జనం.. మధ్యలో మనం.. అలా ఉండాలిరా లైఫ్‌ అంటే.. అంటూ రవితేజ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంది. నేల టిక్కెట్టు గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు" అంటూ ఆవేశంతో విలన్ లను హెచ్చరిస్తూ చేసిన యాక్షన్ సీన్స్ అలరించాయి. అంతేకాకుండా శక్తికాంత్‌ కార్తీక్‌ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుంది. ఇంటిల్లిపాదినీ అలరించేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.