ఆర్జీవీ పని నాకు నచ్చలేదు : పూరి జగన్నాథ్

SMTV Desk 2018-04-20 13:03:24  puri jagannath, pawan kalyan, ram gopal varma,

హైదరాబాద్, ఏప్రిల్ 20 : పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ కక్ష కట్టి శ్రీరెడ్డితో దుర్భాషలాడించడం పట్ల ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు జీవితాన్నిచ్చిన పవన్ ను దూషించడం పట్ల దర్శకుడు పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. "నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది. అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఆర్జీవీ చేసిన పని నాకు నచ్చలేదు. నా ప్రాణం ఉన్నంత వరకూ నేను పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తా" అంటూ పోస్ట్ చేశారు.