చంద్రబాబు దీక్షకు కారణమిదే.. : వీహెచ్

SMTV Desk 2018-04-19 15:03:28  V hanumantha rao, congres leader, chandrababu, venkaiah naidu.

హైదరాబాద్, ఏప్రిల్ 19 : టీడీపీ ప్రజలను మోసం చేయలేదని.. కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ ఆ విషయాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. కేంద్రం కళ్ళు తెరిపించడానికే చంద్రబాబు దీక్షకు దిగినట్లు వెల్లడించారు. వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించిన వీహెచ్.. ఆంధ్రప్రదేశ్ పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే మోదీ, జైట్లీ భయపడతారన్నారు. రాష్ట్రంలో ఎక్కాడు చూసినా.. ఏటీఎంలలో నగదు కొరత కనిపిస్తుందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీహెచ్‌ ధ్వజమెత్తారు.