వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన కెసిఆర్

SMTV Desk 2020-01-10 15:38:12  

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. ఈ నెల 22 న జరిగే మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం కేసీఅర్ భావించారు. అయితే దీనికి సంబంధించి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముందుగానే సమాచారం అందిస్తూ నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకోవాలని టీఆర్ఎస్ ఆదేశించింది.

అయితే నేడు ఉదయం పదిన్నర గంటలకే తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశానికి సమయానికి రాకపోవడంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీఎంగా ఉండి తానే సమయానికి వచ్చానని మీరు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అయిత ఆలస్యంగా వచ్చిన వారిలో మంత్రి ఈటెల, ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. ఇకపోతే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళాల్సి ఉండడంతో సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు.