కాంగ్రెస్ ని దెబ్బ తీసిన ఎంఐఎం

SMTV Desk 2019-10-24 15:47:43  

మహారాష్ట్ర ఎసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఈ సారి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 59స్థానాల్లో పోటీచేసిన ఎంఐఎం అనుకున్నట్టుగా గెలుపొందలేకపోయింది. పోటీచేసిన అన్ని స్థానాల్లో ఎంఐఎం వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి అంతిమంగా బీజేపీ లాభపడింది. ఒక్క మాలెగావ్‌లో మాత్రం ఎంఐఎం అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. మరో వైపు గతం తో పోల్చుకుంటే బీజేపీ స్థానాలు తగ్గాయి. శివసేన స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇక 40 స్థానాల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం వల్ల పరోక్షంగా ఎదురుదెబ్బ తగిలింది.