భాగ్యనగరం ఖాతాలో మరో అరుదైన ఘనత

SMTV Desk 2019-11-01 15:28:02  

విశ్వశనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహా నగరం మరోసారి ప్రపంచం చూపు తన వైపు తుహిప్పుకునేలా చేసింది. ఎన్నో ప్రేత్యకతలు ఉన్న భాగ్యనగరం తన ఖాతాలో మరో అరుదైన ఘనతను చేర్చుకుంది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చడానికి రాజధానిని ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా 66 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు లభించగా, అందులో మన దేశం నుంచి రెండు నగరాలను ఎంపికచేయడం విశేషం. హైదరాబాద్ నగరాన్ని ఆహారం (గ్యాస్ట్రోనమీ) విభాగంలో ఎంపికచేయగా, ముంబై నగరం సినిమారంగం నుంచి స్థానం దక్కించుకుంది.

ఇరానీ చాయ్ నుంచి మొదలుపెడితే ఎక్కడా లేని రుచి హైదరాబాద్ బిర్యానికి మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. బిర్యాని అంటే హైదరాబాద్ అనే పేరును సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఒక్క బిర్యానీయే కాదు పలు భిన్నమైన విభిన్నమైన వంటకాలలు హైదరాబాద్ లో లభిస్తాయి. ఈ క్రమంలో ఆహారం, తినుబండారాల (గాస్ట్రోనమీ) విభాగం నుంచి హైదరాబాద్ ను యునెస్కో సెలక్ట్ చేసింది.వీటితోపాటు బెంగాలీ, గుజరాతీ స్వీట్లు కూడా నగరంలో అందుబాటులో ఉన్నాయి. నగర జనాభాలో దాదాపు 12 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారంలో ఉపాధి పొందుతున్నారు.