పెళ్లికి ఒప్పుకోలేదని… ప్రేమజంట ఆత్మహత్య….

SMTV Desk 2019-11-20 12:59:58  

చెన్నై: ప్రేమ జంటకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని కుద్దలోర్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తొరపడి గ్రామానికి చెందిన స్వాతి, కొట్టనలంపాకమ్ గ్రామానికి చెందిన మదన్ ప్రేమించింది. ఇద్దరు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్ల పెళ్లికి స్వాతి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో పాటు మదన్ మరిచిపోవాలని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కుద్దలోర్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. కదులుతున్న రైలు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే లోకో పైలట్ స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రులకు, బంధువులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. రైలు చెన్నై నుంచి రామేశ్వరం వెళ్తుండగా కుద్దలోర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.