తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల

SMTV Desk 2019-10-25 14:40:35  

గ్రూప్-2 తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటించింది. వివిద శాఖలలో 1032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నవంబర్ 2016లో పరీక్షలు నిర్వహించింది. దాదాపు 3 ఏళ్ళ తరువాత వాటిలో 1027 పోస్టులకు నిన్న తుది ఫలితాలు ప్రకటించింది. మిగిలిన 5 పోస్టుల ఫలితాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసింది. గురువారం ప్రకటించిన ఫలితాలలో వివిద శాఖలలో భర్తీ కానున్న పోస్టుల వివరాలు:

• కార్మికశాఖలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు: 3

• న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు: 10

• దేవాదాయశాఖలో గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు: 11

• మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-3: 19

• ఆర్ధికశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు: 20

• హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు: 20

• సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2: 23

• సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లను 62

• పంచాయతీ రాజ్‌భవన్‌లో విస్తరణ అధికారులు: 67

• జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సచివాలయం) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు: 90

• వాణిజ్యపన్నుల శాఖలో ఆఫీసర్లు: 156

• డెప్యూటీ తహసీల్దార్లు: 259

• ఎక్సైజ్ ఎస్ఐలు: 284 మంది త్వరలో విధులలో చేరానున్నారు.