మా అమ్మకు మూడు నెలలుగా పైసల్లేవ్.. కంటతడి పెట్టించిన చిన్నారి మాటలు!

SMTV Desk 2019-11-25 12:01:39  

తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆర్టీసీ చరిత్రలోనే ఇది పెద్ద సమ్మె గా అభివర్ణిస్తున్నారు. దాదాపు 51 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆదివారం నాడు సమావేశమైన ఆర్టీసీ కార్మికులు సమస్యల పట్ల, తదుపరి ఆర్టీసీ సమ్మె కార్యాచరణ వివరించారు అశ్వథామ రెడ్డి. ఇన్ని రోజులైనా ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొనడం అభినందనీయం అని అన్నారు. ఈరోజు 25 న, సోమవారం అన్ని డిపోల వద్ద నిరసన చేపడతామని తెలిపారు.

మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో సమావేశమైన తరుణం లో ఒక చిన్నారి మాట్లాడిన మాటలు అక్కడి వారందరిని కంటతడి పెట్టించేశాయి. అయితే ఆర్టీసీ కార్మికులలో తన తల్లి గురించి చెబుతూ, కేసీఆర్ తాతకు నమస్కారములు, మా అమ్మకు మూడు నెలలుగా పైసల్లేవ్, దసరా, దీపావళి కి కొత్త దుస్తులు కొనలేదు, ఫీజు కట్టకపోతే పరీక్షా రాయనియ్యలేదు, స్కూల్ నుంచి పంపించేశారు. చర్చలకు పిలవాలని కేసీఆర్ తాత ని కోరుతున్న అంటూ చిన్నారి ఏడవడం తో అక్కడి మౌన దీక్షకు కూర్చున్న మహిళా కార్మికులు కంటతడిపెట్టారు.

అయితే కేసీఆర్ ఆర్టీసీ సమ్మె ఫై సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే హైకోర్టు ఆర్టీసీ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇపుడు తెలంగాణ లోనే, కాదు ప్రతి చోట ఇదే చర్చ. అయితే కేసీఆర్ నిర్ణయం ఏదయినా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.