తీవ్ర స్థాయిలో మండిపడ్డ రామ్ చరణ్..!

SMTV Desk 2018-04-18 17:50:15  RAM CHARAN, RAM CHARAN FACEBOOK POST, FILM INDUSTRY.

హైదరాబాద్, ఏప్రిల్ 18 : ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్.. ప్రస్తుత౦ సినీ పరిశ్రమపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రామ్‌ చరణ్‌ తేజ్‌ తన ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు. ఇండస్ట్రీ అనేది అందరం కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబంలా౦టిది. ఇండస్ట్రీలో ప్రతి ఒక మహిళను ఎంతో గౌరవంగా చూస్తారు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే.. దానిని న్యాయబద్దంగా పరిష్కరించుకోవాలి కాని ఇలా అనవసరంగా ఇందులోకి వేరే వారి పేర్లు లాగి బురద చల్లే ప్రయత్నం చేయొద్దంటూ పేర్కొన్నారు. వివాదంతో సంబంధం లేని వ్యక్తి పేరును ప్రస్తావిస్తూ.. పేరు సంపాదించుకోవాలని చూస్తే అది చవకబారుతనంగా ఉంటుంద౦టూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీ౦తో పాటు సహనంతో ఉండాలంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై చరణ్ ఈ విధంగా స్పందించారు.