శ్రీరెడ్డి కి ముందు.. శ్రీరెడ్డి తర్వాత..

SMTV Desk 2018-04-18 15:18:21  Ram gopal varma, varma twitter, sreereddy,

హైదరాబాద్, ఏప్రిల్ 18 : కాస్టింగ్ కౌచ్ పేరుతో గత కొద్దిరోజులుగా శ్రీరెడ్డి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరోసారి స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ నేటి శ్రీరెడ్డి ప్రభావంతో.. "శ్రీరెడ్డికి ముందు.. శ్రీరెడ్డికి తర్వాత.." గా విడిపోనుందని, శ్రీరెడ్డి ఒక సునామిలా సృష్టించి౦దన్నారు. మొదట తిరుగుబాటుకు సంబంధించిన ఏ విషయమైనా ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. దానిని మంచిగా అర్థం చేసుకోకుండా నెగిటివ్ గా ఆలోచిస్తారని తెలిపారు. ఇలా జరగడం దురదృష్టకరమైనదే కాని ప్రస్తుతం అనివార్యమైపోయింది అంటూ వర్మ పోస్ట్ చేశారు.