శ్రీరెడ్డిపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు

SMTV Desk 2018-04-17 20:32:55  sri reddy, srireddy pawan kalyan comments, janasena chief, tollywood

హైదరాబాద్, ఏప్రిల్ 17 : సినీనటి శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మంగళవారం పంజాగుట్ట పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను దూషించినందుకు ఆయన అభిమాని శశాంక్‌వంశీ.. శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశాంక్‌వంశీ స్థానికంగా వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ అన్నా’ అన్నాం కదా అందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకుంటున్నాను. పవన్‌ను ఎవరూ.. ఏ అమ్మాయి కూడా అన్నా అని పిలవదు. అన్నా అన్నందుకు ఒక అమ్మాయిగా నన్ను నేను అవమానించుకున్నాను. పవన్ కల్యాణ్ ***** (రాయలేని పదం వాడింది)" అని అసభ్యంగా మాట్లాడింది.