రాజమౌళి చాలా గర్వంగా ఉంది : మహేష్ బాబు

SMTV Desk 2018-04-14 15:13:01  ss rajamouli, mahesh babu, bahubali movie.

హైదరాబాద్, ఏప్రిల్ 14 : ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచిన "బాహుబలి: ది కన్‌క్లూజన్‌" సినిమాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు వరించింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం.. అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించి అనేక రికార్డులను నెలకొల్పింది. తాజాగా ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ, ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అనే మూడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.. రాజమౌళికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. "2018 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీ సినిమా బాహుబలి భారతీయ సినీచరిత్రలో ఓ మైలురాయి. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం" అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు.. కొరటాల శివ దర్శకత్వంలో నటించిన "భరత్‌ అనే నేను" చిత్రం ఏప్రిల్‌ 20న విడుదలకు సిద్ధమవుతోంది.