ఛీ.. ఛీ.. నాకైతే బతకాలని‌లేదు : మాధవి లత

SMTV Desk 2018-04-13 17:15:10  MADHAVI LATHA, FACEBOOK POST, JAMMU KASHMIR RAPED GIRL.

హైదరాబాద్, ఏప్రిల్ 13 : టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వల్ల తను కూడా చాలా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొన్నానని ప్రముఖ నటి మాధవి లత పేర్కొంది. తనకు ఇండస్ట్రీ అంటే ఇష్టమని.. చావైనా, బతుకైనా సినీ ఇండస్ట్రీలోనే అంటూ భావోద్వేగపు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. జమ్మూకశ్మీర్ లో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై మరో ట్వీట్ చేసింది. "నిజంగా చెబుతున్నా నాకైతే బతకాలని ‌లేదు. ఛీ ఏం దేశం రా ఇది.. నా దేశం మంచిది. దేశభక్తి.. మేమంతా దేవుళ్ల౦. ఇక్కడ ఆడపిల్ల సురక్షితం. మీ మూవీ ఇండస్ట్రీ దరిద్రం. నీకు చెప్పే దారే లేదు. ఎన్ని మాటలు. మరి ఏంటి ఇది చిన్నపిల్ల పైనా అరాచకం మన దేశంలో. ఆడపిల్ల అంటే కడుపులో నుండే రక్షణ. బయటకు వస్తే భక్షణ.. ఏమిరా ఈ దౌర్భాగ్యం. పసిబిడ్డరా. కోసి కారం పెట్టాలి ఇలాంటి నా.... ఇప్పుడు మాట్లాడండి బ్రదర్స్ మాట్లాడండి" అంటూ మాధవీలత ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టింది.