"ఆఫీసర్" టీజర్‌ విడుదల..

SMTV Desk 2018-04-09 10:57:41  officer teaser, nagarjuna, ram gopal varma.

హైదరాబాద్, ఏప్రిల్ 9 : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న "ఆఫీసర్" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్‌ను నేటి ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ చూస్తే ముంబై కేంద్రంగా కథ మొత్తం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం నాగార్జున హైదరాబాద్ నుండి ముంబైకి స్పెషల్ ఆఫీసర్‌గా వెళ్తారు. అక్కడ జరిగిన ఓ గొడవలో భాగంగా "మొదలు పెట్టిన పనిని పూర్తి చేయడం నా బాధ్యత" అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర టీజర్‌ను నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. "ఆఫీసర్" చిత్రం కోసం రామ్ గోపాల్ వర్మ తో కలిసి పని చేసిన ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశాను. దేనికైనా ముగింపు అనేది అవసరం. మేము ఏం చేశామో ఓ సారి చూడండి. అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ చిత్రం మే నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.