"ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌" ఫస్ట్ లుక్..

SMTV Desk 2018-04-06 17:38:41  the accidental prime minister, first look, manmohan singh.

ముంబై, ఏప్రిల్ 6 : భారత ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించిన డా. మన్మోహన్‌ సింగ్‌ ఇతివృత్తంతో ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌" పుస్తకం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని మన్మోహన్‌ సింగ్‌ మీడియా అడ్వైజర్‌ గా పని చేసిన సంజయ్‌ బారు రాశారు. అయితే ఈ పుస్తకాన్ని ఆధారంగా దర్శకుడు విజయ్ గుట్టే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా "ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌" ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మన్మోహన్‌ సింగ్‌గా అనుపమ్‌ ఖేర్‌ నటించారు. చూడడానికి అనుపమ్‌ అచ్చం మన్మోహన్‌ సింగ్‌లాగే కనిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రలో జర్మన్‌ నటి సుజాన్నే బెర్నర్ట్‌ను ఎంపికచేసుకున్నారు. సినిమా చిత్రీకరణ మొత్తం ఇంగ్లాండ్‌లోనే జరుగుతుంది.