సల్మాన్ కోసం కత్రినా..!

SMTV Desk 2018-04-06 12:16:56  katrina kaif visited siddivinayaka temple, salman khan, katrina kaif,

ముంబై, ఏప్రిల్ 6 : రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్షను జోధ్ పూర్ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నుండి సల్మాన్ బయటపడాలని బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ఈ ఉదయం పూజలు చేసింది. ముంబైలోని ప్రముఖ ప్రసిద్ధ వరసిద్ధి వినాయక గుడికి తన సోదరితో కలిసి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయినప్పటికీ చట్టం తన పని తానూ చేసుకుపోతుంది. సల్మాన్ బెయిలు పిటిషన్ పై జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు నేడు విచారణ చేపట్టింది. సల్మాన్ తరపు న్యాయవాదుల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పై తీర్పు వెలువడేవరకూ ఆయన జోధ్ పూర్ జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇదే కేసులో టబు, సైఫ్ అలీ ఖాన్, సొనాలీబింద్రేలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.